
గుణుపూర్ జీఐఈటీలో అగ్ని ప్రమాదం
● రు.కోటి విలువైన కంప్యూటర్
పరికరాలు దగ్ధం
● నిలిచిపోయిన ఓజేఈఈ పరీక్షలు
జీఐఈటీ భవణంలో పొగలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వర్సిటీ ప్రాంగణంలోని అడ్మినిస్ట్రేటివ్, కంప్యూటర్ ల్యాబ్‌లలో మంటలు చెలరేగడంతో సుమారు కోటి రూపాయల విలువైన కంప్యూటర్లు, ఇతర పరికరాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో అంచనా వేస్తున్నారు. శనివారం ఇదే వర్సిటీలో ఓజేఈఈ పరీక్షలు జరగాల్సి ఉంది. సరిగ్గా పరీక్షకు 20 నిమిషాలు ముందు అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎగ్జామ్ రద్దు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తొలుత కంప్యూటర్ విభాగంలో దట్టమైన పొగలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు గమనించిన సిబ్బంది వెంటనే విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎన్.వి.జె.రావుకు సమాచారం తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కంప్యూటర్ విభాగం అగ్నికి ఆహుతయ్యింది.

గుణుపూర్ జీఐఈటీలో అగ్ని ప్రమాదం

గుణుపూర్ జీఐఈటీలో అగ్ని ప్రమాదం

గుణుపూర్ జీఐఈటీలో అగ్ని ప్రమాదం