
హేమలతకు శాంతిదూత అవార్డు
భువనేశ్వర్: బలమైన దేశాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర అనిర్వచనీయమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కొనియాడారు. ప్రపంచ మాతృ దినోత్సవం పురస్కరించుకుని శనివారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాత్రికేయం, సామాజిక సేవ, ఆరోగ్య సంరక్షణ, మహిళా అవగాహన, విద్య, క్రీడలు తదితర రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన 10 మంది మహిళలకు శాంతిదూత అవార్డుతో సత్కరించారు. ఈ క్రమంలో మారుమూల మల్కన్‌గిరి ప్రాంతంలో గృహిణిగా ఉంటూనే పాత్రికేయ రంగంలో రాణిస్తున్న డబ్బీరు హేమలత శాంతిదూత అవార్డు అందుకున్నారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కొండ కోనల్లో సంక్లిష్ట వార్తల సేకరణతో సామాజిక చైతన్యానికి దోహదపడుతున్నందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహక సంస్థ మా ఘొరొ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రుతుపూర్ణ మహంతి తెలిపారు. కార్యక్రమంలో న్యాయ, అబ్కారీ శాఖ మంత్రి పృథ్విరాజ్ హరిచందన్, అడ్వకేటు జనరల్ పీతాంబర ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

హేమలతకు శాంతిదూత అవార్డు