బీజేడీ రాష్ట్ర కార్యవర్గంలో ప్రముఖులకు చోటు
కొరాపుట్: బీజేడీ రాష్ట్ర కార్యవర్గంలో కొరాపుట్,న బరంగ్‌పూర్ జిల్లాలకు చెందిన ప్రముఖ నేతలకు చోటు దక్కింది. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ పట్నయక్ ఆదేశాల మేరకు ఈ జాబితా విడుదలైంది. కొరాపుట్ జిల్లా జయపూర్‌కు చెందిన మాజీ మంత్రి రబినారాయణ నందోకి అత్యున్నత రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కంది. రబి నందో వర్గం చాలా రోజులుగా కొరాపుట్ జిల్లా అధ్యక్ష పదవి కోసం లాబీ చేస్తుండగా.. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించింది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ఎంపీలు రమేష్ చంద్ర మజ్జి, ప్రదిప్ మజ్జిలకు ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా రాష్ట్ర సీనియర్ జనరల్ సెక్రటరీ పదవులు లభించడంతో ఇరు వర్గాల్లో సమన్యాయం దక్కంది. ఒకే పార్టీలో ఉంటున్న అక్కాతమ్ములు లోపముద్ర భక్షి పాత్రో, బృగు భక్షిపాత్రోలకు పదవులు లభించాయి. బృగుకి స్టేట్ సీనియర్ జనరల్ సెక్రటరి, లోపముద్రకి స్టేట్ జనరల్ సెక్రటరి పదవులు దక్కాయి. ఇక నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన రాజ్య సభ ఎంపీ, ఒడియా సినీ హీరో మజిబుల్లా ఖాన్ (మున్నా ఖాన్)కి రాష్ట్ర మైనారిటీ సెల్ సౌత్ జోన్ సెక్రటరీ పదవులు దక్కాయి. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రభుజానీకి రాష్ట్ర జనరల్ సెక్రటరి పదవి వరించింది.