
కొట్‌పాడ్ ఎమ్మెల్యే సహృదయత
కొరాపుట్: రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి కొట్‌పాడ్ ఎమ్మెల్యే సహృదయత చాటుకున్నారు. సోమవారం కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర కుంద్రా సమితి వైపు వెళ్తున్నారు. ఇదే మార్గంలో బిజ్జిగుడ–బలియాల మధ్య ఒక బైక్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు క్షతగాత్రులు రోడ్డు పక్కన పడి ఉన్నారు. ఇది చూసిన ఎమ్మెల్యే వెంటనే తన కారు దిగి అంబులెన్స్‌ను పిలిపించారు. క్షతగాత్రులను స్ట్రెచర్ మోసుకుంటూ వెళ్లి వాహనం ఎక్కించారు. వారు ఆస్పత్రికి చేరేంత వరకు పరిస్థితి సమీక్షించారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలేక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 21 వినతులను స్వయంగా కలెక్టర్ స్వీకరించారు . జిల్లా కేంద్రంలో పరిసర గ్రామాలకు చెందిన పలు సమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ మాట్లాడుతూ, జిల్లా వాసుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏయే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్లి పరిశీలించి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వేలవి కాలం నీటి సమస్య ఎక్కువగా ఉందని, దీనిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎస్పీ వినోద్ కుమార్ పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదాన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర శభరో, ప్రఽభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

కొట్‌పాడ్ ఎమ్మెల్యే సహృదయత