
దిఘాలో జగన్నాథ్ ధామ్ వివాదం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయం సీనియర్‌ర్ దైతపతి రామకృష్ణ దాస్‌మహాపాత్రో పశ్చిమ బెంగాల్‌లో చేసిన వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. దీంతో ఆదివారం వివాదాస్పద సీనియర్ దైతపతి రామకృష్ణ దాస్‌మహాపాత్రోని ముఖాముఖి ప్రశ్నించేందుకు ఆలయ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా దైతపతిని ప్రశ్నించిన మేరకు ఆలయ ప్రధాన నిర్వాహకుడు సీఏఓ దైతపతి రామకృష్ణ దాస్ మహాపాత్రోకు తాఖీదు జారీ చేశారు. తాఖీదు మేరకు సంతృప్తికర వివరణ దాఖలు చేయాలని ఆదేశించారు. తాఖీదు అందిన రోజు నుంచి 7 రోజుల లోపు వివరణ దాఖలు చేయాలని గడువు కల్పించారు. ఈ గడువులోపు సంతృప్తికరమైన వివరణ అందకపోతే శ్రీ జగన్నాథ ఆలయ చట్టం, 1955 ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తాఖీదులో స్పష్టం చేశారు.
దిఘా ఆలయానికి జగన్నాథ్ ధామ్ అనే పదాన్ని ఉపయోగించడం పూర్తిగా తప్పని సేవాయత్‌ల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలని ఛొత్తీషా నియోగుల వర్గం కోరింది. ముఖ్యమంత్రి స్వరాష్ట్రానికి చేరడంతో ఈ మేరకు చర్యలు చేపడతామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ అభయం ఇచ్చారు. పూరీ జగన్నాథ ఆలయంలో మూల విరాటుల కొత్త విగ్రహాలను చెక్కడానికి నవ కళేబరం సమయంలో ఉపయోగించిన దైవిక వేప కలప – పవిత్రమైన ‘దారు‘ను అనధికారికంగా దిఘా ఆలయంలో విగ్రహాల తయారీకి వినియోగించినట్లు రామకృష్ణ దాస్ మహాపాత్రో పశ్చిమ బెంగాలు మీడియాతో ప్రతిస్పందనలో పేర్కొన్నారు. పవిత్రమైన కలపను దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని సర్వత్రా పట్టు బిగుసుకుంది.
పశ్చిమ బెంగాలు నుంచి రాష్ట్రానికి చేరిన తర్వాత స్థానిక మీడియాతో స్పందించిన రామకృష్ణ దాస్‌మహాపాత్రో ఈ ఆరోపణల్ని ఖండించారు. వేరొక వేప చెట్టు నుంచి సేకరించిన కలపతో విగ్రహాన్ని తయారు చేసి స్వయంగా ప్రతిష్టించానని వివరించారు. ఈ ద్వంద్వ వైఖరిని తొలగించి స్పష్టమైన వైఖరితో వివరణ దాఖలు చేయాలని శ్రీ మందిరం సీఏఓ ఆది వారం తాఖీదులు జారీ చేశారు. రామకృష్ణ దాస్ మహాపాత్రో పాటు దైతపతి నియోగుల సంఘం అధ్యక్షుడు గణేష్ దాస్ మహాపాత్రో కూడా విచారణకు హాజరయ్యారు. అధికార వర్గం నుంచి శ్రీ మందిరం సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢితో ఆలయ సేవా విభాగం అధికారి జితేంద్ర కుమార్ సాహు హాజరు అయ్యారు.
పోలీసు ఠాణాలో పలు ఫిర్యాదులు
ఈ వివాదంలో రోజుకో ఫిర్యాదు పోలీసు ఠాణాలో దాఖలు అవుతున్నాయి. శ్రీ మందిరం సింహ ద్వారం ఠాణాలో ఈ ఫిర్యాదులు దాఖలు అవుతున్నాయి. శ్రీ మందిరంలో పదిలంగా ఉండాల్సిన పవిత్ర కలప అడ్డకోలుగా రాష్ట్రం దాటి వెళ్లిపోతుందని ఈ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ వ్యతిరేకంగా కూడ ఠాణాలో ఫిర్యాదు దాఖలు అయినట్లు అనధికారిక వర్గాల సమాచారం. శ్రీ మందిర మేఘ నాథ్ ప్రహరి లోపల భద్రంగా ఉండాల్సిన అమూల్య సామగ్రిని దైతపతి నియోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ దాస్ మహాపాత్రోపై జగన్నాథ సేన కార్యకర్తలు సింహ ద్వారం ఠాణాలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్
సింహ ద్వారం పోలీస్ ఠాణాలో దైతపతి నియోగుల సంఘం కార్యదర్శి పేరిట ఆన్‌లైన్‌లో ఒక ఫిర్యాదు నమోదైందని సమాచారం. పూరీలోని సత్య నగర్ ప్రాంతానికి చెందిన సమాచార హక్కు కార్యకర్త జయంత్ కుమార్ దాస్ ఈ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పూరి శ్రీ మందిరం పాలక మండలి అనుమతి లేకుండా దైతపతి నియోగుల సంఘం కార్యదర్శి రామకష్ణ దాస్ మహాపాత్రో నవకలేబర మిగులు దారు (కలప)ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విక్రయించారని ఎఫ్‌ఐఆర్ జయంత్ కుమార్ ఆరోపించారు. ఈ చర్యలు ఆధారంగా రామకృష్ణ దాస్ మహాపాత్రో వ్యతిరేకంగా భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయాలని జయంత్ కుమార్ దాస్ పేర్కొన్నాడు.
రామకృష్ణ దాస్ మహాపాత్రోకు తాఖీదు జారీ

దిఘాలో జగన్నాథ్ ధామ్ వివాదం

దిఘాలో జగన్నాథ్ ధామ్ వివాదం