
వైద్యుని ఇంట్లో చోరీ
రాయగడ: స్థానిక కస్తూరీనగర్‌లో నివాసముంటున్న డాక్టర్ బి.ఎల్.ఎన్.పృష్టి ఇంట్లో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి పదివేల రూపాయల నగదు, ఒక చేతి గడియారాన్ని దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు పోలీస్ స్టేషన్ ఐఐసీ కేకేబీకే కుహోరో తెలియజేసిన వివరాల ప్రకారం.. గత కొద్ది నెలల క్రితం డాక్టర్ పృష్టి తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లో దొంగతనం చేశారు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు డాక్టర్ ఇంటి తలుపులు తెరిచిఉండటం చూసి అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ పృష్టి ఈ మేరకు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు.