
బైక్ దొంగ అరెస్టు
రాయగడ: బైకు దొంగతనం కేసులో నిందితుడిని సదరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక న్యూ కాలనీకి చెందిన పి.సురేష్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడుని కోర్టుకు తరలించారు. ఐఐసీ కేకేబీకే కుహరో తెలియజేసిన వివరాల ప్రకారం .. గత ఏప్రిల్ 28వ తేదిన న్యూకాలనీలో ఓ వ్యక్తి బైకు చోరీకి గురైంది. దీంతొ బాధితుడు సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని స్థానిక నాగావళి సమీపంలో శనివారం అరెస్టు చేశారు.