
● డ్రైనేజీలా.. డంపింగ్ యార్డులా?
పర్లాకిమిడి పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెత్తను సేకరించడానికి వాహనాలు ఉదయం పూట ప్రతి వార్డులో తిరుగుతుంటాయి. ప్రజలు నెలనెలా యూజర్ చార్జీలు చెల్లిస్తారు. అయితే కొందరు వాహనాల్లో చెత్త వేయకుండా డ్రైనేజీల్లో చెత్త, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పడవేయడంతో పురపాలక సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇటీవల వర్షం పడిన సమయంలో కాలువలు పూడికతో నిండటంతో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వచ్చింది. ఇప్పటికై నా పౌరులు బాధ్యతగా వ్యవహరిస్తూ చెత్తను కాలువల్లో పడేయకుండా సంబంధిత వాహనాలకు అందజేయాలని సిబ్బంది కోరుతున్నారు. – పర్లాకిమిడి

● డ్రైనేజీలా.. డంపింగ్ యార్డులా?

● డ్రైనేజీలా.. డంపింగ్ యార్డులా?