జయపురం: జయపురం జమాల్ లైన్‌లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో చతుర్దశి సందర్భంగా సీతాదేవికి శుక్రవారం ఘనంగా పూజలు జరిపారు. ఉదయం 9.30 గంటలకు వందలాది మంది మహిళలు, యువతులు సీతా దేవికి సామూహిక లలితా సహస్ర నామములతో ’కుంకుమ పూజలు, అష్టోత్తర శతనామములతో పుష్ప అర్చన జరిపారు. ఆలయ పూజారి ఉలిమిరి నాగేశ్వరరావు పంతులు శాస్త్రోత్తంగా మహిళలచే పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీరామమందిర ఆలయ కమిటీ అధ్యక్షులు గోరపల్లి నాగరాజు, కార్యదర్శి
సాన జగదీష్, సహాయ కార్యదర్శి ఎన్.చంద్ర శేఖర్, కోశాధికారి వారణాశి రమేష్ గుప్త, సహాయ కోశాధికారి బి.వెంకట రమణ, ఉపాధ్యక్షులు సి.హెచ్.చంద్రశేఖర్, అందవరపు తిరుమల, ఎన్.మల్లికార్జున, వారణాశి సత్యనారాయణ, వారణాశి శివప్రసాద్, ఎన్.ఈశ్వర రావు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో సీతాదేవికి కుంకుమ పూజలు
భక్తిశ్రద్ధలతో సీతాదేవికి కుంకుమ పూజలు
భక్తిశ్రద్ధలతో సీతాదేవికి కుంకుమ పూజలు


