రాధా కృష్ణుల విగ్రహ ప్రతిష్టాపన
భువనేశ్వర్: ఖుర్దారోడ్ అకౌంట్సు కాలనీ బాలాజీ మందిర సముదాయం అంచెలంచెలుగా బహుళ దేవుళ్ల ప్రాంగణంగా విస్తరిస్తోంది. ఈ దేవస్థానంలో ప్రధాన ఆరాధ్య దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొత్తగా ఈ సముదాయంలో రాధా కృష్ణుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్ట మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంలో భాగంగా నూతన విగ్రహాలకు దాన్యాధివాసం, జలాధివాసం, క్షీరాధివాసం, పుష్పాధివాసం, షయాధివాసం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ ఉద యం రాధాకృష్ణుల విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నట్లు కార్యదర్శి జేకే రావు తెలిపారు.


