ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
కొరాపుట్: శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం రాత్రంతా కొనసాగాయి. కొరాపుట్, దమంజోడి, ఉమ్మర్‌కోట్, నందపూర్ తదితర పట్టణాలలో యువత నృత్యాలు చేస్తూ శోభాయాత్రను కొనసాగించారు. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కొన్నిచోట్ల సోమవారం ఉదయం వరకు శోభాయాత్రలు జరిగాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, ఉత్సవ కమిటీలు చర్యలు తీసుకున్నాయి.
భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా నిత్యం రెండు పూటలు వేకువ జాము నుంచి సీతారామ లక్ష్మణుల సమేత ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజాదులు నిర్వహిస్తారు. సాయంత్రం వేళలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సమితి ఉత్సవ ప్రాంగణం భక్త జనంతో కళకళలాడుతుంది. నవమి సందర్భంగా ఖరగపూర్ వికాస్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ బృందం వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు


