సారా బట్టీలపై దాడులు
జయపురం: సబ్ డివిజన్ కుంద్ర సమితి రాణిగుడ పంచాయతీ శివునిగుడ గ్రామ సమీపంలో ఇప్ప సారా తయారు చేస్తున్న బట్టీపై కుంద్ర పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతంలో చట్ట విరుద్ధంగా నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో కుంద్ర పోలీసు అధికారి అశ్వినీ కుమార్ పట్నాయక్ నేతృత్వంలో పోలీసులు ఉదయం 7 గంటల సమయంలో దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా నాటుసారా తయారు చేసేందుకు సిద్ధం చేసిన 2 వేల లీటర్ల ఇప్పఊటను ధ్వసం చేశామని పోలీసు అధికారి పట్నాయక్ వెల్లడించారు. అలాగే 55 లీటర్ల ఇప్పసారాతో పాటు సారా వంటకానికి వినియోగించే సామగ్రిని సీజ్ చేశామని తెలిపారు. దీనిలో భాగంగా ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.


