వర్ధమాన కళాకారులకు ఆదరణ
భువనేశ్వర్: విద్య, కళలు, సాహిత్యం, క్రీడలు, నృత్యం తదితర రంగాల్లో ఔత్సాహిక వ్యక్తులకు ప్రత్యేక ఆదరణ కల్పించనున్నట్లు జట్నీ తెలుగు సంక్షేమ సంఘం ప్రకటించింది. ఈ ఏడాది తెలుగు సంవత్సరాది పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కార్యవర్గ సభ్యులు మంగళవారం తెలిపారు. నటనా రంగంలో రాణిస్తున్న వర్దమాన కళాకారులకు ఉత్సవ వేదికపై ప్రత్యేకంగా సత్కరించారు. ఒడియా చలన చిత్ర నటీనటులు సవ్యసాచి, అర్చిత, ఎఫ్‌ఎం బాబాయి, హాస్య సంభాషణ రచయిత రాము తదితర ప్రముఖులకు ప్రోత్సాహక పురస్కారాలు ప్రదానం చేశారు. ఆచార, సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా సాంఘిక కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సత్కార గ్రహీతలు వేదికపై ప్రదర్శించిన హాస్య ప్రదర్శన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది.


