మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
12
గంటల..
కొరాపుట్:
విశాఖపట్నం–రాయ్‌పూర్ జాతీయ రహదారి–26 పై ఆదివారం రాత్రి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు వివిధ సమయాల్లో సుమారు 12 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి సునాబెడా మధ్య మెహన్ పొడ గ్రామ సమీపంలో అత్యధికంగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు విస్తరణ పనులు గత 4 నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. అనేక చోట్ల గోతులు తీశారు. రోడ్డు మెత్తం మట్టి పనులు జరుగుతున్నాయి. కాల వైశాఖి ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీ వర్షం పడింది. దాంతో మట్టి బురదగా మారింది. సుమారు 12 కిలోమీటర్ల పరిధిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అనేక చోట్ల పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు కూడా ముందుకెళ్లలేక నిలిచిపోయాయి. ఈ మార్గం గుండా ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొరాపుట్, నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాలతో పాటు చత్తీస్‌గఢ్‌కు వెళ్తారు. రాయ్‌పూర్, భువనేశ్వర్, విజయవాడ, పూరి, రాజమండ్రి, విశాఖపట్నం తదితర పట్టణాలకు ఈ మార్గం గుండా రాత్రి పూట బస్సు సర్వీసులు నడుస్తాయి. దాంతో వందలాది మంది ప్రయాణికులు బస్సులలో ఉండి పోయి అవస్థలు పడ్డారు. ఉదయం పూట పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు బురద లోనే నడుచుకుంటూ ముందుకు సాగారు. ప్రతి అరగంటకు వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఈ వార్తలు దానావలంగా వ్యాపించడం తో విశాఖ పట్నం నుంచి వచ్చే వాహనాలు అరుకు,నందపూర్ మీదుగా జయపూర్ వైపు మళ్లాయి. భువనేశ్వర్ వైపు వెళ్లే వాహనాలు రాయగడ లేదా భవాని పట్న వైపు మరలాయి.
న్యూస్‌రీల్
స్తంభించిపోయిన విశాఖపట్నం– రాయ్‌పూర్ జాతీయ రహదారి
కొరాపుట్–సునాబెడాల మధ్య నిలిచిపోయిన వందలాది వాహనాలు
నరకం
నరకం
నరకం