రక్తదానం.. ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం.. ప్రాణదానం

Published Mon, Mar 24 2025 6:39 AM | Last Updated on Mon, Mar 24 2025 11:21 AM

రక్తద

రక్తదానం.. ప్రాణదానం

రాయగడ: స్థానిక బాలాజీ నగర్‌లో గల శ్రీకళ్యాణ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 54 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాతులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ అధికారి డాక్టర్‌ గౌతం పట్నాయక్‌ పరివేక్షణలో జరిగిన ఈ శిబిరంలో ఆమో ఒడిశా ప్రతినిధి శివప్రసాద్‌ దొర పాల్గొన్నారు.

మల్కన్‌గిరిలో

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో గల కుమిటిగూడ వీధిలో ఉన్న సత్యసాయి మందిరంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్‌ కె.గోపాల్‌కృష్ణ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 8 యూనిట్ల రక్తం సేకరించి జిల్లా బ్లడ్‌ బ్యాంక్‌కు అందజేశారు. మల్కన్‌గిరి సత్యసాయి కమిటీ సభ్యులు కె.క్రష్ణకుమారి, ఎం.దమయంతి, ఎ.ఉమ, బాలాజీ పట్నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం.. ప్రాణదానం1
1/1

రక్తదానం.. ప్రాణదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement