జయపురం: స్థానిక విక్రమదేవ్ చిత్రకళ, క్రాఫ్ట్ కళాశాలలో సాంప్రదాయ చిత్రకళపై శనివారం వర్క్‌షాపు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అజయ కుమార్ దాస్, జయపురం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాల ప్రిన్సిపాల్ జుధిష్టర్ మల్లిక్‌లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా సాంస్కృతిక విభాగ విశ్రాంత అధికారి కృష్ణచంద్ర నిశంకొ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న చిత్రకళ, చేతి కళలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రాచీన సాంప్రదాయ చిత్రకళలపై ఔత్సాహిక కళాకారుల్లో అవగాహన కల్పించేందుకు వర్క్‌షాపుల నిర్వహణ ఎంతో అవసరమన్నారు. అనంతరం వర్క్‌షాపులో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కృష్ణపంగి, అర్జునదాస్, కె.సునీల్ కుమార్, సురేంద్రబాగ్ తదితరులు పాల్గొన్నారు.
సాంప్రదాయ చిత్రకళపై వర్క్‌షాపు