● నీలావడి అమ్మవారిని దర్శించుకున్న
కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్
కొరాపుట్: నీలావడిలో అగ్ని గంగమ్మ అమ్మవారిని కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలకలు వేర్వేరుగా దర్శించుకున్నారు. మంగళవారం కొరాపుట్ జిల్లా బందుగాం సమితి అలమండ సమీపంలో ఉన్న నీలావడిలోని అగ్ని గంగమ్మ ఉత్సవాలకు కలెక్టర్ హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఘటాన్ని కలెక్టర్ తలపై ఉంచారు. కలెక్టర్ మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు జెడ్పీ చైర్మన్ సస్మితా మెలక అమ్మవారిని దర్శించుకున్నారు. దేవలయ కమిటీ సభ్యులు మెమెంటోతో ఆమె ని సత్కరించారు.
నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, జెడ్పీ
నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, జెడ్పీ
నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, జెడ్పీ