
బరంపురం: శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
బరంపురం: అహింసతోనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని బరంపురం ఎంపీ చంద్రశేఖర్ సాహు అన్నారు. ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సర్కిల్ జైల్ ప్రాంగణంలో అహింసా రథాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని, ప్రజలను చైతన్యపరిచేందుకు రథం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలంతా గాంధీ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బరంపురం మేయర్ సంఘమిత్ర దొళాయి, ఎమ్మెల్యే విక్రమ్ పండా, బరంపురం సర్కిల్ జైల్ జైలర్ మరియు సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్లాకిమిడి మహారాజా బాలుర ఉన్నత పాఠశాల నుంచి మహేంద్రగిరి ఉన్నత పాఠశాల వరకు పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహేంద్రగిరి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పూర్ణచంద్ర ప్రధాన, ఎం.ఆర్.బాయ్స్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం వై.ధర్మారావు, పరమేశ్వర్ నాయక్, కె.వాసుదేవ్‌రావు, కె.వి.రెడ్డి, సుదీప్త కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రాజవీధి ప్రైవేటు కల్యాణ మండపంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహించారు. శాంతి కోసం కలిసికట్టుగా పోరాడాలని స్వాద్ పీస్ నెట్ వర్క్ బిమల్ చంద్ర నాయక్ కోరారు. సమావేశానికి జిల్లాలో నలుమూలల నుంచి క్రిస్టియన్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

పర్లాకిమిడి: ర్యాలీలో బాయ్ స్కౌట్స్ విద్యార్థులు

పర్లాకిమిడి: పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

బరంపురం: అహింస రథం ప్రారంభిస్తున్న ఎంపీ శేఖర్ సాహు తదితరులు