
మిశ్రమ పంటలను పరిశీలిస్తున్న ఆర్‌వైఎస్‌ఎస్ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది
బొబ్బిలి: మండలంలోని మెట్టవలస గ్రామానికి చెందిన ఉంగట్ల రామకృష్ణ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బైక్ కొనే విషయమై భార్యతో గొడవ పడి మనస్తాపం చెంది గడ్డిమందు తాగేశాడు. కుటుంబసభ్యులు గమనించి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చదలవాడ సత్యనారాయణ తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
బొబ్బిలి: ప్రకృతి వ్యవసాయంలో మిశ్రమ పంటలు సాగుచేయడం వల్ల అధిక దిగుబడులు, లాభాలు వస్తాయని ప్రకృతి వ్యవసాయం ఆర్‌వైఎస్‌ఎస్ అధికారులు రాధామాధవ్, రాజేష్ తెలిపారు. మండలంలోని మెట్టవలస పొలాల్లో పత్తిలో సజ్జలు, జొన్న, కంది, ఆముదం, కూరగాయల పంటల సాగును చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మిశ్రమ పంటలను ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీపీఎం ఆనందరావు, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది వాండ్రాసి లక్ష్మి, శంకరరావు పాల్గొన్నారు.
ఆపన్న హస్తం
విజయనగరం అర్బన్: మానసిక దివ్యాంగురాలి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష రూపాయల సాయం అందింది. పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం గ్రామానికి చెందిన గుడివాడ సత్యవతి తమ కుమార్తెకు మానసిక వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని ఇటీవల మరడాం పర్యటనలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించి మంజూరు చేశారు.

చెక్కును అందజేస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి