రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌లో విధులు నిర్వహిస్తూ రైలు నిర్వహణలో లోపాలను సకాలంలో గుర్తించి అవాంఛనీయ ఘటనలను నివారించడంలో కృషి చేసిన ముగ్గురు డివిజన్ ఉద్యోగులు రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ చేతుల మీదుగా జీఎం మ్యాన్ ఆఫ్‌ద మంత్ సేఫ్టీ అవార్డులు అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
డివిజన్ నుంచి పాయింట్ మెన్‌లు జి.కృష్ణమోహన్, పి.విద్యాసాగర్, రాజమండ్రిలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ బి.వెంకటశేఖర్‌కు జీఎం అవార్డులను అందజేసి అభినందనలు తెలిపారు.


