కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందే ఆర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే ఆర్జీల పరిష్కారంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 98 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో ఎంఏయూడీ 24, పంచాయతీరాజ్ 11, పోలీస్ శాఖకు 10, మార్కెటింగ్ 6, డీఆర్‌డీఏ 5, రెవెన్యూ 5, పౌరసరఫరాలు 5, విద్య 4, వ్యవసాయం 3, విద్యుత్ 3, ఉపాధి కల్పన 3, ఆర్‌డబ్ల్యూఎస్ 3, హెల్త్ 2, భూగర్భ గనులు 2, దేవదాయ 2, మత్స్య 2, సర్వే, పరిశ్రమలు, జలవనరులు, ఏపీఎస్‌డబ్ల్య్లూఆర్‌ఈఐఎస్, డ్వామా, కార్మిక శాఖ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రోడ్లు, భవనాలకు సంబంధించి ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 98 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.


