లబ్బీపేట(విజయవాడతూర్పు): మహాత్మాగాంధీ రోడ్డులోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేయగా, ఇతర అధికారులు పాల్గొన్నారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ దంపతులు వేదమంత్రోచ్చరణ నడుమ సంప్రదాయ పద్ధతిలో స్వామి వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహ మూర్తులకు వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీలు కేజీవీ సరిత, బి.లక్ష్మీనారాయణ, కృష్ణప్రసన్నలతో పాటు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు, పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది, రామాలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఏఆర్ క్వార్టర్స్ రామాలయంలో
ఘనంగా నిర్వహణ


