జగన్ పాలనలో నాణ్యతతో కూడిన కిట్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో ఏటా విద్యార్థులకు పుస్తకాలతో పాటుగా అత్యంత నాణ్యతతో కూడిన బ్యాగులు, షూస్ అందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వాటిని అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో చక్కగా యూనిఫామ్ ధరించి బ్యాగులు తీసుకొని షూస్ వేసుకొని హుందాగా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యే వారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులకు అందించిన బ్యాగులు, షూస్‌లో సగం వరకూ చిరిగిపోయి ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.


