విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
పెండింగ్ పనులు పూర్తి చేసేదెన్నడో?
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
సామ్రాజ్యవాద ఉడత ఊపులకు కాలం చెల్లింది
పెనమలూరు: యనమలకుదురులోని లాకుల సెంటర్‌లో వేంచేసి ఉన్న శ్రీకనకదుర్గమ్మ వారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
లబ్బీపేట: విజయవాడ విచ్చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాను మానసిక వైద్యులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఇండ్ల విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు శుక్రవారం విరాళాలను అందజేశారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జరపల మంగ్యా(60). ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాకు చెందిన వ్యక్తి. ఈయనకు ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి సోకింది. చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా వ్యాధి తీవ్రత తగ్గలేదు. కూలిపనులు చేసి జీవించే మంగ్యా చికిత్స పొందుతూ నవంబర్ 2న చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబ పోషణ ప్రశ్నార్థకమైంది. పరిస్థితి దయనీయంగా మారింది. సకాలంలో కృష్ణా నదీ జలాలు అందిస్తే మంగ్యా దక్కేవాడని ఆ కుటుంబసభ్యులు వాపోతున్నారు.
పైలెట్ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరాయి. త్వరలోనే కృష్ణా నదీ జలాలు సరఫరా చేస్తాం. పైపులైను ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు రావలసి ఉంది. అన్ని హాబిటేషన్లలో ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి కావొచ్చింది.
– లక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ఏకొండూరు
జాడలేని శుద్ధ జలం!
గిరిజన తండాల ప్రజలు కిడ్నీవ్యాధి బారిన పడుతున్నందున కృష్ణా నదీ జలాలను సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి. ఏకొండూరు మండలంలోని 30 గ్రామాల్లో శుద్ధి చేసిన జలాలను సరఫరా చేయాలి. కిడ్నీ రోగులకు పూర్తిస్థాయి చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలి.
– మేకల డేవిడ్,
సీపీఐ నాయకుడు, ఏ.కొండూరు
తిరువూరు: ఏ.కొండూరు మండలంలో గిరిజన తండాలకు కృష్ణా జలాలు సరఫరా చేసే నిమిత్తం రూ.50కోట్లతో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే 75శాతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా.. మిగిలిన పనులను కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడచినా ఓ కొలిక్కి తీసుకురాలేకపోయింది. మండలంలో 200 కిలోమీటర్ల నిడివి పైపులైన్ల నిర్మాణం చేపట్టగా, 14 ఓవర్ హెడ్ ట్యాంకులను అదనంగా నిర్మిస్తున్నారు. కిడ్నీ వ్యాధికి గురైన గిరిజనులు శుద్ధి చేసిన నీరందక మృత్యువాత పడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గత ఏడాది కాలంలో పలుమార్లు ఈ మండలంలో పర్యటించి త్వరలో కృష్ణా జలాలు వస్తా యని ప్రకటించడం మినహా పనులు పూర్తిచేయలేదు. గత 15 రోజుల్లోనే ముగ్గురు కిడ్నీరోగులు మృత్యువాత పడగా, 175 మంది చికిత్స పొందుతున్నారు.
ఇంకెన్నాళ్లీ నిర్లక్ష్యం..
ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న కారణంగా ఏ.కొండూరు మండలంలోని 38 గ్రామాలు, 21 హాబిటేషన్లలో గిరిజనులు కిడ్నీవ్యాధి బారిన పడుతున్నట్లు శాసీ్త్రయంగా నిర్ధారించినప్పటికీ.. యుద్ధప్రాతిపదికన కృష్ణాజలాల సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోంది. మండలంలోని చీమలపాడు శివారు వెంకట తండా, పెద తండా, కేశ్యా తండా, గ్యామా తండా, కృష్ణారావుపాలెం తండా, మాన్‌సింగ్ తండా, దీప్లా నగర్, చైతన్యనగర్, మత్రియా తండా, ఏ.కొండూరు తండా, కుమ్మరికుంట్ల, రేపూడి తండా, పాల్తియా తండా, ఎల్‌ఐజీ తండా, గోపాలపురం తండా, వల్లంపట్ల, గొల్ల మందల తండాలలో కిడ్నీవ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ట్రాక్టర్లతో అందిస్తున్న శుద్ధి చేసిన మంచినీటిని తాత్కాలికంగా అందిస్తున్నారు. మాధవరం, రేపూడి, కుమ్మరకుంట్ల గ్రామాలకు డైరెక్టు పంపింగ్ స్కీం ద్వారా తాగునీరందిస్తున్నారు.
హామీలతో సరి..
ఏ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితులున్న గ్రామాలు, తండాలకు కృష్ణా జలాల సరఫరా తాము అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచలేదు. తాను గెలిచిన వెంటనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కృష్ణా జలాల సాధనకు పాదయాత్ర కూడా చేపట్టి అధిష్టానం హామీ ఇవ్వడంతో వెంటనే నిలిపివేశారు. వామపక్షాలు పలుమార్లు కిడ్నీ రోగుల సమస్యలపై ఆందోళనలు జరిపాయి. ఏ.కొండూరులో కిడ్నీ రోగులకు చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఫలితం లేదు.
మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ, చిత్రంలో ఎమ్మెల్యే బొండా తదితరులు
7
ఇబ్రహీంపట్నం నుంచి ఏ.కొండూరు మండలానికి కృష్ణా నదీ జలాల సరఫరాకు పైపులైన్ల ఏర్పాటులో కొండపల్లి వద్ద రైల్వే శాఖ అనుమతి రావలసి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన ఇంతవరకు ఆమోదానికి నోచలేదు. వల్లంపట్లలో ఓవర్ హెడ్ రిజర్వాయర్ నిర్మాణం, కుమ్మరికుంట్ల వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. పైపులైన్ల నిర్మాణం కొన్ని తండాల్లో పూర్తి కాలేదు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


