యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నారాయణ యాదవ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ కానూరుకు చెందిన నారాయణ యాదవ్ నియమితులయ్యారు. ఆ మేరకు ఆ సంఘ (ఆల్ ఇండియా యాదవ మహాసభ) జాతీయ అధ్యక్షుడు రవీంద్ర సింగ్ యాదవ్ ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. నవంబరులో పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ వివరాలను జాతీయ మహాసభ సమన్వయకర్త సి.శేఖర్ యాదవ్‌కు అందజేయాలని రవీంద్రసింగ్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు నారాయణ యాదవ్ జాతీయ అధ్యక్షుడు రవీంద్ర సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


