డిసెంబరు 27న కూచిపూడి కళావైభవం విజయవాడ కల్చరల్: భారత్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 వ తేదీ శనివారం హైదరా బాద్‌లో కూచిపూడి కళావైభవం నిర్వహిస్తున్నట్లు భారత్ ఆర్ట్స్ చైర్‌పర్సన్ లలితారావు తెలిపారు. విజయవాడలోని సంగీత కళాశాల లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే కూచిపూడి నృత్యోత్సవంలో 7,209 మంది నృత్య కళాకారులు నృత్యాలను ప్రదర్శిస్తారని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు గిన్నిస్ బుక్‌లో నమోదు చేసి ధ్రువపత్రాలను అందజేస్తారన్నారు. పేర్ల నమోదుకు 951511 2939, 628 150 6722 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్మోతిర్మయి, నాట్యాచార్యుడు సీహెచ్ అజయ్‌కుమార్, వేదాంతం పార్థసారథి, భాగవతుల శ్రీనివాసమూర్తి, లలిత, మాగంటి వసుధ పాల్గొన్నారు. తొలుత కూచిపూడి కళావైభవం పోస్టర్ ఆవిష్కరించారు.
ఉద్యోగానికి సంభాషణా నైపుణ్యం అవసరం కోనేరుసెంటర్: నేటి పోటీ యుగంలో సంభా షణా నైపుణ్యాలు వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో విజయానికి అత్యంత కీలకమని విశ్రాంత ఐఐఎస్ అధికారి జి.కొండలరావు అన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో సంభాషణా నైపుణ్యం – విజయానికి ద్వారం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండలరావు మాట్లాడుతూ మాటల ద్వారా మన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలిగే సామర్థ్యం ప్రతి విద్యార్థికి అవసరమని అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ విద్యార్థులను ప్రాంగణ ఎంపికలకు సన్నద్ధం చేయటానికి ఆయా రంగాలలో విశిష్ట వ్యక్తులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాంబాబు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
వ్యాధుల నియంత్రణపై
దృష్టి సారించాలి ఉధృతంగా ప్రవహిస్తున్న వైరా కట్టలేరు
గుడ్లవల్లేరు: పశువుల్లో వచ్చే వ్యాధులతో పాటు పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా పశు వైద్యాధికారి ఎన్.సి.హెచ్. నరసింహులు సూచించారు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుల వారి కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో మంగళవారం కృష్ణాజిల్లా పశు సంవర్ధక సహాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పశుసంవర్ధక సహాయకులకు శాఖాపరమైన విషయాలపై అవగాహన కలిగించారు. జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు జాబ్ చార్ట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలు, ప్రభుత్వ స్కీములు నిర్వహించే విధానం వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ గుడివాడ డివిజన్ ఉప సంచాలకుడు డాక్టర్ సి.శ్రీనివాస్, ఇంటర్నేషనల్ ఎన్జీవో డాక్టర్ సాహిల్, ఎంపీడీఓ ఎండీ ఇమ్రాన్, వైద్యులు డాక్టర్ ఎం.జగన్నాధరావు, డాక్టర్ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు
నందిగామ రూరల్: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మండలంలోని దాములూరు కూడలి వద్ద వైరా కట్టలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కాజ్‌వేపై వరద పోటెత్తినా ఓ వ్యక్తి కర్ర సాయంతో వైరా కట్టలేరును దాటేందుకు యత్నించాడు. అధికారులు స్పందించి రాకపోకలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
1/2
డిసెంబరు 27న కూచిపూడి కళావైభవం
2/2
డిసెంబరు 27న కూచిపూడి కళావైభవం