
చంద్రబాబువి కుట్రపూరిత రాజకీయాలు
● డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలం
గడుపుతున్న కూటమి నేతలు
● మాజీ మంత్రి వెలంపల్లి,
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి వెలం పల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై అక్రమ మద్యం కేసు బనాయించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మంగళవారం వారు జోగి రమేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దనరావు పాత ఏఎన్నార్ బార్, నూతన బార్ సమీపంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రం, మద్యం డంపింగ్‌పై చర్చించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై కూటమి నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎకై ్సజ్ శాఖ దాడుల్లో టీడీపీ నేతలు తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు నేరుగా దొరికినప్పటికీ ఆ నేరాన్ని జోగి రమేష్‌కు ఆపాదించాలని చూడటం దారుణమన్నారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం పట్టుబడిన రోజునే జోగి రమేష్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. అక్రమ మద్యం తయారీ కేంద్రం పరిశీలించినందుకు జోగి రమేష్, మరికొంతమంది నాయకులపై ఆరోజు కేసులు నమోదు చేశారని, ఇప్పుడు తయారీ సూత్రధారి జోగి రమేష్‌గా జనార్దనరావుతో చెప్పించడమంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన గాలికొదిలేసిన కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.