
పత్రికలపై అక్రమ కేసులు సరికాదు..
ప్రభుత్వాలు ఐదేళ్లకొకసారి మారుతూ ఉంటాయి. కానీ నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ.. ప్రజల తరఫున పొరాడే పత్రికలు శాశ్వతంగా ఉంటాయి. అటువంటి పత్రికలపై అక్రమ కేసులు బనాయించి పత్రికా స్వేచ్ఛని హరిస్తే.. ప్రజా స్వామ్యానికే ప్రమాదం తలెత్తుతుంది. ప్రభుత్వాలు ఆ విధంగా వ్యవహరించకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పంథాను మార్చుకోవాలి. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేసి, ప్రభుత్వానికి మీడియా పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుకోవాలి.
– జ్యేష్ఠ రమేష్‌బాబు, మైలవరం మాజీ ఎమ్మెల్యే