
కృష్ణా వర్సిటీలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం
కోనేరుసెంటర్: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్‌సీసీ కేడెట్లు జాగృతి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో క్యాడెట్లు ఓజోన్ పరిరక్షణ, వాయు కాలుష్యం నివారణ, ప్రకృతి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బోర్డింగ్ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ డి.రామశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడేది ఓజోన్ పొర, దానిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కాలుష్య నియంత్రణ, జీవనశైలి మార్పులు, ప్రకృతి వనరుల సంరక్షణ ద్వారానే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించగలమని ఆయన చెప్పారు. ఎన్‌సీసీ యూనిట్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడినట్లు ప్రతిజ్ఞ చేశారు.