అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరా ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరా ఇవ్వాలి

Aug 6 2025 6:16 AM | Updated on Aug 6 2025 6:16 AM

అంతరా

అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరా ఇవ్వాలి

ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్స్‌, సరఫరా లైన్లలో అంతరాయాలను తగ్గించాలన్నారు. ఇందుకోసం ముందుగానే నిర్వహణ పనులు, అవసరమైన సామగ్రి అందించేందుకు, అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయాయని, కరెంట్‌ పోయిందని ఫిర్యాదులొస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి విద్యుత్‌ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాగుదారులకు 9 గంటల నిరంతరంగా విద్యుత్‌ సరఫరా అందించాలన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకం ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్‌ టెక్నికల్‌ మురళీకృష్ణయాదవ్‌, డైరెక్టర్‌ ప్రాజెక్ట్స్‌ కేవీఎస్‌ఎన్‌ మూర్తి, డైరెక్టర్‌ ఫైనాన్స్‌ ఎస్‌. వెంకటేశ్వర్లు ఆయా జిల్లాల విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

బస్టాండ్‌(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో రోజువారీ వేతనంతో డ్రైవర్‌లుగా పనిచేయటానికి ఆసక్తి కలిగిన డ్రైవర్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై దానం ఓ ప్రకటనలో తెలిపారు. వయస్సు 59 ఏళ్లలోపు ఉండి, చెల్లుబాటులో ఉన్న హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌, 18 నెలల పాటు హెవీ వెహికల్‌ అనుభవం ఉండాలని తెలిపారు. జిల్లాలోని తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ, గవర్నరుపేట–1, గవర్నరుపేట–2, ఇబ్రహీంపట్నం, ఆటోనగర్‌, విద్యాధరపురం డిపోల పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు దగ్గరలోని డిపోలు గాని, జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలాగే పీఓ కార్యాలయం 9959225453, ఆటోనగర్‌– 9959225463, జగ్గయ్యపేట–9959225460, గవర్నరుపేట2– 9959225456, విద్యాధరపురం–9959225458, విజయవాడ–9959225459, తిరువూరు–9959225465, గవర్నరుపేట1– 9959225455, ఇబ్రహీంపట్నం–9959225457 ద్వారా ఆయా డిపో మేనేజర్‌లను సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

గుర్తు తెలియని వృద్ధుడు మృతి

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధు డిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కొత్తపేట సీఐ చిన్న కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్‌లో సోమ వారం ఓ వృద్ధుడు స్పృహ కోల్పోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మృతుడికి సుమారు 60 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై బ్లూ షర్ట్‌ ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరా ఇవ్వాలి 1
1/1

అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరా ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement