
పగిడిపల్లి–గుంటూరు–విజయవాడ సెక్షన్‌లో తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ మంగళవారం గుంటూరు, విజయవాడ డివిజన్‌ల పరిధిలోని పగిడిపల్లి–గుంటూరు–కృష్ణా కెనాల్–విజయవాడ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. ముందుగా విజయవాడ, గుంటూరు డివిజన్‌ల డీఆర్‌ఎంలు మోహిత్ సోనాకి యా, సుధేష్ణసేన్‌లతో కలసి ఆయా సెక్షన్‌లలో రియర్ విండో తనిఖీల ద్వారా ఆ సెక్షన్‌లలోని సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రత అంశాలు, ట్రాక్‌ల నిర్వహణను పరిశీలించారు. అక్కడ నుంచి నల్గొండ స్టేషన్‌లో వెయిటింగ్ హాల్, దివ్యాంగుల టాయిలెట్‌లు, లిఫ్ట్‌లు, తాగునీటి సౌకర్యం, ప్రయాణికుల మౌలిక సదుపాయాల ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం గుంటూరు డివిజనల్ కార్యాలయంలో.. ఆ తర్వాత విజయవాడ డివిజనల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పనితీరుపై చర్చించారు.
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
కంకిపాడు: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. కంకిపాడు పట్టణంలోని రెల్లికాలనీకి చెందిన వడ్డాది లక్ష్మీనారాయణ(22) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ ఈనెల 4వ తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.

పగిడిపల్లి–గుంటూరు–విజయవాడ సెక్షన్‌లో తనిఖీలు