
ద్వారావతి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
ఆకలితో ఉన్నవారి కడుపులను నింపి.. మానవ సేవయే మాధవ సేవగా తలచి దాతృత్వంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ద్వారావతి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి సోమవారం అర్జీలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే వారికి ద్వారావతి నిత్యాన్నప్రసాద సేవ ద్వారా భోజనం అందిస్తున్నారు. సోమవారం ఈ సేవా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వారం దాదాపు 200 మంది ఆఖలి తీర్చడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ జి.సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ పి.సత్య, ట్రస్ట్రీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.