
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
గుడివాడరూరల్: అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 6.50 లక్షల విలువైన 14 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు, వచ్చిన సమాచారం మేరకు సీఐ కొండపల్లి శ్రీనివాస్, ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ సిబ్బందితో టీంలుగా ఏలూరురోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన కోరదల ఏసు, చిలకంటి రంగా రావు.. వారి బైక్‌లను తిప్పుకుని పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారన్నారు. దీనిలో14 బైక్‌లను వివిధ ప్రాంతాల్లో తాకట్టు పెట్టినట్లు తెలుసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్లో ఒకరు ఆటోడ్రైవర్, మరొకరు తాపీమేసీ్త్ర అని తెలిపారు. ఆటస్థలాలు, ఆస్పత్రులు, ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను మారు తాళాలతో దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారన్నారు. ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా బైక్‌లను చోరీలు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ వివరించారు. దొంగలను పట్టుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ గౌతమ్, కానిస్టేబుళ్లు సురేంద్రబాబు, వేణుగోపాల్, మురళీకృష్ణ, సత్యనారాయణను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
రూ.6.50 లక్షల విలువైన 14 బైక్‌లు స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ