
సీసీ కెమెరాలు అలర్ట్.. దొంగలు పరార్
పెడన: పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు 2.15 గంటల ప్రాంతంలో మెయిన్‌రోడ్డులోని ఒక బడ్డీకొట్టులో ఇద్దరు దొంగలు చోరీకి యత్నించి సీసీ కెమెరాలు అలర్ట్‌తో పరారైన సంఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు పట్టణంలోని పెడన శాఖ గ్రంథాలయానికి వెళ్లే దారిలో మెయిన్ రోడ్డు పక్కన భోగాది కమలప్రసాద్‌కు చెందిన (మాస్టారు)కిళ్లీ షాపునకు ఆధునీక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి సుమారు 2.12 గంటలకు గుర్తు తెలియని ఇద్దరు దొంగలు బడ్డీకొట్టు వద్దకు ప్రవేశించి తాళాలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ లోగా సీసీ కెమెరా అలర్ట్ కావడంతో పాటు వచ్చిన వారిని ఫ్లాష్‌తో ఫొటోలు తీసి యాజమానిని అలర్ట్ చేసింది. ఎప్పుడైతే సీసీ కెమెరా ఫొటోలు తీసిందో దొంగలు ముఖాలను చేతులతో కప్పుకొని పరారయ్యారు. ఈ విషయం వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడంతో సీసీఎస్ పోలీసులు, పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ సత్యనారాయణ జరిగిన సంఘటనపై ఆరా తీశారు. షాపు యాజమాని కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.