
పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల
సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో ప్రాజెక్టు డ్యామ్ ఈఈ సుబ్రహ్మణ్యం, ఏడీఈ ఎన్.జయశంకర్ శనివారం తెలిపారు. విద్యుత్ ప్రాజె క్టులోని రెండు యూనిట్ల ద్వారా 8,757 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతలకు విడుదల చేసి 1.874 ఎంఎం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా 11,320 క్యూసెక్కులు వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయి 75.50 మీటర్లకు నీరు చేరుకుందని, రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు.