
క్యాన్సర్‌ను జయించేలా చికిత్సలు
ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే జీవితం ముగిసినట్లేనని భావించేవాళ్లు. కానీ నేడు ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్వస్థత చేకూర్చి సాధారణ జీవితం గడిపేలా చేయగలుగుతున్నాం. అదే మాకు సంతృప్తినిస్తుంది. క్యాన్సర్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది. ఇంకా కొందరు నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నవారు ఉన్నారు. ప్రస్తుతం అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో సూక్ష్మదశలోనే క్యాన్సర్‌ను నిర్ధారించి సత్ఫలితాలు సాధించగలుగుతున్నాం. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి వాటిని అత్యుత్తమ చికిత్సా పద్ధతుల ద్వారా నయం చేయగలుగుతున్నాం.
– డాక్టర్ ఎన్.సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు
జీవనశైలి వ్యాధులు పెరిగాయి
సమాజంలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మూడు పదుల వయస్సులోనే మధుమేహం, రక్తపోటు, ఒబెసిటీలకు గురవుతున్నారు. దీంతో హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి వైద్యుడు బాధ్యతగా వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి.
– డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి,
మధుమేహ వ్యాధి నిపుణుడు
●
రోగి కృతజ్ఞతే మాకు సంతృప్తి
నిత్యం ఎంతో మంది ఆయాసం, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వస్తుంటారు. వారికి సరైన చికిత్స అందిస్తే వారు తర్వాత ఓపీకి వచ్చినపుడు మా పట్ల ఎంతో కృతజ్ఞతా భావం కనపరుస్తుంటారు. అదే మాకు కొండంత సంతృప్తి నిస్తుంది. కోవిడ్ సమయంలో వందలాది మందికి సేవలు అందించాం. ఆ సమయంలో మాకు కోవిడ్ సోకే అవకాశం ఉంటుందని తెలిసినా, రోగులకు చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేశాం. అదే మాకు సంతృప్తి నిస్తుంది.
–టి.కార్తీక్, శ్యాసకోశ వ్యాధుల నిపుణుడు
విలువలతో కూడిన సేవలు అందించాలి
వైద్యుడు సమాజ సేవకునిగా పనిచేయాలి. వైద్యాన్ని వ్యాపారంగా పరిగణించకూడదు. రోగులతో మంచిగా మెలగాలి. విసుక్కోకూడదు. సమయపాలన, కమిట్‌మెంట్, డిసిప్లేన్ అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వాస్పత్రిలకు పేదలే వస్తుంటారు. పేదలకు వైద్య సేవలు అందించే అదృష్టం ప్రభుత్వ వైద్యులకు మాత్రమే ఉంటుంది. అలాంటి చోట విద్యనభ్యసించే వారు సైతం సేవా భావాన్ని అలవర్చుకోవాలి.
–డాక్టర్ ఆలపాటి ఏడుకొండలు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల

క్యాన్సర్‌ను జయించేలా చికిత్సలు

క్యాన్సర్‌ను జయించేలా చికిత్సలు