
ప్రత్యక్ష దైవాలు వైద్యులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రాణాపాయంతో ఆస్పత్రికి వచ్చిన రోగికి సత్వర వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించిన వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తారు. రోగులకు సేవలు అందించే క్రమంలో పలువురు వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతుంటారు. అయినప్పటికీ తమ వృత్తి ధర్యాన్ని నెరవేరుస్తూనే ఉంటారు. కరోనా సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైద్యుడు కరోనా బారినపడి చావు అంచులదాకా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ
ఒకప్పుడు రోగి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేసే వాళ్లు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి వ్యాధినైనా నిర్ధారించడమే కాదు. ముందుగా లక్ష ణాలు గుర్తించే పరికరాలు వచ్చాయి. ఎంఆర్‌ఐ, సీటీ, పెట్‌సీటీలు ఉన్నాయి. దీంతో కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించగలుగుతున్నారు. చికిత్సలో సత్ఫలితాలు సాధించగలుగుతున్నారు. గర్భస్థ పిండానికి సైతం వైద్యం చేసే స్థాయికి మన వైద్యులు ఎదిగారు. అరుదైన జబ్బులకు విజ యవంతంగా చికిత్సలు అందిస్తున్నారు. జబ్బు చేసి వచ్చిన వారు నయం అయిన తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లేటప్పుడు రోగి తెలిపే కృతజ్ఞతలే వైద్యులకు సంతృప్తినిస్తాయి.
ప్రాణాపాయంతో వచ్చిన వారికి పునర్జన్మ
సేవలు అందిస్తూ ఇన్‌ఫెక్షన్స్
బారిన పడిన డాక్టర్లు ఎందరో...
ఆధునిక సాంకేతికతను
అందిపుచ్చుకుంటూ ప్రాణం పోస్తున్నారు
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం...