
దివ్యాంగులతో తొండాట
దివ్యాంగులతో కూటమి ప్రభుత్వం తొండాట ఆడుతోంది. పింఛన్ల సంఖ్యను కుదించేందుకు సదరం క్యాంపుల పేరిట వేధిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న పేద దివ్యాంగులను మళ్లీ సదరం క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సదరం క్యాంపుల వద్ద కనీసం వీల్‌చైర్లు కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బందుల పాలుచేస్తోంది. చేసేదేమీ లేక దివ్యాంగులను వారి బంధువులు భుజాలు, వీపులపై మోస్తూ సదరం క్యాంపులకు తీసుకొస్తున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేసిన సదరం క్యాంపు వద్ద దివ్యాంగుల దుస్థితిని ఈ ఫొటోల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

దివ్యాంగులతో తొండాట

దివ్యాంగులతో తొండాట

దివ్యాంగులతో తొండాట