జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ

Apr 18 2025 12:42 AM | Updated on Apr 18 2025 12:42 AM

జిల్ల

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ

చిలకలపూడి

(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.గోపీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న అరుణసారిక బదిలీ కావటంతో విశాఖపట్నం ఏపీ వాల్యూయాడెడ్‌ ట్యాక్స్‌ అప్పిలయేట్‌ ట్రిబ్యూనల్‌ చైర్మన్‌గా పనిచేస్తున్న జి. గోపీని జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ లోపభూయిష్టం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ లోపభూయిష్టంగా చేశారని ఏపీ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. గాంధీనగర్‌లోని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన రోస్టర్‌ విధానంతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్‌ విధానాన్ని పక్కనపెట్టి మాల, మాదిగ ఉప కులాలకు సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు ఉన్న 15శాతం రిజర్వేషన్‌ను మాదిగలకు 7, మాలలకు 7, ఉప కులాలకు ఒక శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అప్పుడే మాదిగల 30 ఏళ్ల పోరాటానికి ఫలితం ఉంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్‌ వద్దని, ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన వర్గీకరణ వల్ల మాదిగలకు నష్టం జరుగుతుంటే, మాదిగలకు ఐకాన్‌ అని చెప్పుకొనే మంద కృష్ణమాదిగ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఈ నెల 23 నుంచి మే 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ ఎమ్మార్పీఎస్‌ నాయకులు చెరుకూరి కిరణ్‌ మాదిగ, పూనూరు జార్జ్‌ మాదిగ, మంద నాగమల్లేశ్వరరావు మాదిగ, రెల్లి సంఘం నాయకుడు ఎర్రంశెట్టి ప్రసాద్‌ రెల్లి పాల్గొన్నారు

బీచ్‌ కబడ్డీ పోటీలకు

స్థల పరిశీలన

మంగినపూడి(మచిలీపట్నంరూరల్‌): మండల పరిధిలోని మంగినపూడిబీచ్‌లో మే నెలలో నిర్వహించనున్న బీచ్‌ కబడ్డీ పోటీలకు అనువైన ప్రదేశం కోసం అధికారులు, స్పోర్ట్స్‌ అథారిటీ బృందం గురువారం బీచ్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. జాతీయస్థాయి బీచ్‌ కబడ్డీ పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించిన మెప్మా పీడీ పి. సాయిబాబు, కబడ్డీ అసోసియేషన్‌ అధికారులు పరిశీలించి నిర్వ హించే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆంధ్ర కబ డ్డీ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అర్జునరా వు, కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు

పరిశుభ్రతే లక్ష్యం

గన్నవరం: మండలంలోని సూరంపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి. అర్జునరావు నేతృత్వంలో అధికారులు పర్యటించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఈ బృందం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ పనిచేస్తోందన్నారు. దీని కోసం ప్రతి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది తప్పనిసారిగా ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని చెప్పారు. ఈ చెత్త ద్వారా వర్మికంపోస్ట్‌ ఎరువుల తయారీతో సంపదను సృష్టించాలన్నా రు. సర్పంచ్‌ ఈలప్రోలు శ్రీనివాసరావు, ఎంపీ డీఓ టి. స్వర్ణలత, ఈఓపీఆర్డీ టి. భారతి, పంచా యతీ కార్యదర్శి టి. లక్ష్మణరావు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ 
1
1/1

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement