విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 11 2025 2:47 AM | Updated on Apr 11 2025 2:47 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

‘సూపర్‌ సిక్స్‌’

ఎగవేతకు కుట్ర

ధర్నాలో ప్రగతిశీల మహిళా సంఘం

ప్రతినిధులు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అప్పులను సాకుగా చూపి వాటిని ఎగవేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) మండిపడింది. గురువారం విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌ నందు ప్రగతిశీల మహి ళా సంఘం(పీఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్‌. గంగాభవాని మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను గాలికి వదిలేసిందన్నారు. కూటమి నేతలు బ్రాందీ షాపుల వాటాలు పంచుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు మహిళలు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులకు హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇపుడు అమాయకంగా ఖజానాలో డబ్బు లు లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన పది నెలల్లో రూ. 1.50 కోట్ల అప్పులు చేశారని, అయినా పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఏమైపోయారో..

పీఓడబ్ల్యూ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు పి.పద్మ మాట్లాడుతూ మహిళలపై చేయి వేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఏమైపోయారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలు, మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు అంతులేకుండా జరుగుతున్న పవన్‌ కల్యాణ్‌ నోరు మెదకపోవడాన్ని తప్పుపట్టారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. దుర్గ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో ఎన్నికల కమిషనర్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ, తెలంగాణ ఎన్నికల కమిషనర్లు గురువారం దర్శించుకున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని, ఏపీ ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీ ఇంద్రకీలాద్రికి విచ్చేయగా ఆలయ అధికారులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్‌, ఏఈవో చంద్రశేఖర్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు.

నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. మాల్యాద్రి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,11,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఆలయ అధికారి లక్ష్మణ్‌ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

సాగరతీరంలో మాక్‌ డ్రిల్‌

కోడూరు: మండలంలోని హంసలదీవి సాగరతీరం వెంట పోలీసులు గురువారం ప్రత్యేక మాక్‌డ్రిల్‌ చేశారు. కోస్టల్‌ అధికారుల ఆదేశాల మేరకు గురువారం తీరంలో సీ–విజిల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మచిలీపట్నం ఆర్మడ్‌ రిజర్వ్‌ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకాయతిప్ప మైరెన్‌ సీఐ సురేష్‌రెడ్డి పర్యవేక్షణలో 50 మంది పోలీసులు కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు తీరప్రాంత గ్రామాల్లోకి ప్రవేశించి, ఏదో ఒక ప్రాంతంలో దాగి ఉంటే, వారిని కనిపెట్టేందుకు చేపట్టే చర్యలతో మాక్‌ డ్రిల్‌ చేపట్టామని మైరెన్‌ సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల ఐడీ కార్డులను పరిశీలించడంతో పాటు వారికి కూడా అనుమానితులను గుర్తించే ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఐదేళ్లుగా కార్యవర్గం లేదు.. అధికారుల పర్యవేక్షణ అసలే కనపడదు.. ఇళ్ల మధ్యే పరిశ్రమల వ్యర్థాలు.. వెరసి ప్రమాదంలో పడిన ప్రజారోగ్యం.. ఇది రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన విజయవాడ ఆటోనగర్‌ వద్ద పరిస్థితి. ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించాల్సిన ‘ఐలా’ చేష్టలుడిగిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులే ఐలాకు ఎన్నికలు నిర్వహించకుండా మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆసియాలోనే అతిపెద్ద పారిశామ్రికవాడగా విజయవాడ ఆటోనగర్‌ గుర్తింపు పొందింది. 3వేలకు పైగా చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు, 50వేల మందికి పైగా కార్మికులు నిత్యం ఇక్కడ పని చేస్తుంటారు. 100 టన్నులకు పైగా వ్యర్థాలు నిత్యం ఇక్కడి పరిశ్రమల నుంచి వస్తాయి. అయితే వీటిని గుంటూరులోని జిందాల్‌ పరిశ్రమకు తరలించాలని విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చెబుతోంది. వీరు ఆ పని చేయకుండా టన్నుల కొద్దీ వ్యర్థాలను పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని తాడిగడప మునిసిపాలిటీ, కానూరు నుంచి ఎనికేపాడుకు వెళ్లే దారిలో విజయ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద దాదాపు 100 ఎకరాల పంట పొలాల్లో నిత్యం తెచ్చి పోస్తున్నారు. ఇక్కడ కళాశాలలు, పలు కాలనీలు ఉన్నాయి. ప్లాస్టిక్‌, ఆహార వ్యర్థాలు, కాలం తీరిన మందులను వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. వీటిని దహనం చేస్తుండటంతో విషవాయువులు వ్యాప్తి చెంది, ఆ సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు కలుషితమై వ్యాధులు ప్రబలుతున్నాయని, కేవీఆర్‌ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. శానిటేషన్‌ పర్యవేక్షిస్తున్న ఐలా అధికారులు పట్టించుకోవడం లేదు.

సుప్రీం కోర్టు ఉత్తర్వులు బేఖాతరు..

పొల్యూషన్‌కు సంబంధించిన మట్టి, మునిసిపల్‌ వ్యర్థాలు పంట పొలాల్లో వేయటానికి వీలులేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నా, అధికారులకు చెవికెక్కడం లేదు. రాత్రి వేళ్లలో పంట పొలాల్లో వ్యర్థాలు పోసి తగులబెడుతున్నారు. దీంతో అక్కడ ఆ పంట పొలాలతో పాటు, చుట్టుపక్కల ఉన్న పొలాల్లో సైతం పంటలు పండక రైతులు అల్లాడిపోతున్నారు.

స్థానికులు అడ్డుకుంటున్నా..

ఇటీవల రాత్రి సమయాల్లో డంప్‌ చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చి, ఆరు లారీలను సీజ్‌ చేశారు. వాటిని వదిలి వేయాలని వ్యర్థాలను తీసి వేస్తామని, ఐలా అధికారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, స్థానికుల నుంచి తీవ్ర అభ్యతరం వ్యక్తం అవుతోంది. నిడమానూరు, ఎనికేపాడు, కానూరు గ్రామాల సర్పంచ్‌లు, పెద్దలు, అంతకు మునుపు పోసిన చెత్తను, వ్యర్థాలను పూర్తిగా తొలగించే వరకు, సీజ్‌ చేసిన లారీలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడ నామ మాత్రంగా చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పూర్తి స్థాయిలో చెత్త తొలగించడంతోపాటు, అక్కడ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కానూరు–ఆటోనగర్‌ ప్రధాన రహదారి పక్కనే చెత్త కుప్పలు వేస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. చెత్త కుప్పలు కారణంగా రోడ్డుపై ప్రయాణం చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది.

– అవినాష్‌, పెయింటర్‌, పోరంకి

కానూరు ఆటోనగర్‌కు వచ్చే దారిలో భారీగా చెత్త తీసుకువచ్చి వేస్తున్నారు. కార్మికులు పని చేసే ప్రాంతంలో చెత్త వేయటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. చెత్తకు నిప్పు పెట్టడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెత్తవేసే వారిపై చర్యలు తీసుకోవాలి.

– సురేష్‌, ఆటోనగర్‌ కార్మికుడు, విజయవాడ

పన్ను వసూళ్లు 50 శాతం కంటే తక్కువగా ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేదు. వసూళ్లు 50 శాతం దాటితే ఎన్నికలు నిర్వహిస్తాం. మేము కార్పొరేషన్‌ పన్ను కడుతున్నప్పటికీ చెత్త తరలింపునకు స్థలం కేటాయించలేదు.. జిందాల్‌కు తరలించాలని కార్పొరేషన్‌ అధికారులు సూచించారు. ఇక్కడ ఖాళీగా ఉన్నందున డంపింగ్‌ చేశాం. ఇబ్బంది అయితే మరో చోటుకు తరలించేందుకు ప్రయత్నిస్తాం.

– కె. బాబ్జీ ఇన్‌చార్జి కమిషనర్‌, ఐలా

పంట పొలాల్లో పేరుకు పోయిన వ్యర్థాలను తగలబెడుతున్న దృశ్యం

7

న్యూస్‌రీల్‌

పంట పొలాల్లోకి పరిశ్రమ వ్యర్థాలు స్థానికులు అడ్డుకుంటున్నా ఫలితం శూన్యం జిందాల్‌కు తరలించకుండా రాత్రి వేళల్లో తెచ్చి పడేస్తున్న వైనం ఐదేళ్లుగా ఐలాకు ఎన్నికలు లేకపోవడంతో కొరవడిన పర్యవేక్షణ

ఎన్నికలను అడ్డుకుంటోంది ఎవరు?

ఏపీఐఐసీ

అందుకే నిర్వహించలేదు..

ఐలా(ఇండ్రస్టీయల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) పర్యవేక్షణలో ఆటోనగర్‌ నడుస్తుంది. దీనికి మూడేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. అయితే గత ఐదేళ్లుగా ఐలాకు ఎన్నికలు నిర్వహించటం లేదు. దీనికి ప్రస్తుతం ఇన్‌చార్జి కమిషనర్‌గా

జోనల్‌ మేనేజర్‌ కె. బాబ్జి వ్యవహరిస్తున్నారు. ఈయన ప్రస్తుతం విజయవాడ, ఏలూరు, జోనల్‌ మేనేజర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఐలాకు ఎన్నికలు జరగకుండా అధికారులే అడ్డుకుంటున్నారన్న విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగితే, పాలక వర్గం పర్యవేక్షణ ఉంటుందనే భావనతో ప్రభుత్వాన్ని సైతం అధికారులు మభ్య పెడుతున్నట్లు చెబుతున్నారు. పైగా రూ.20లక్షల–రూ.25లక్షలకు పైగా ముడుపులు అధికారులకు అందుతున్నట్లు సమాచారం. దీంతో ఏదో సాకుచూపి, ఎన్నికలు జరగకుండా అధికారులు మోకాలడ్డుతున్నట్లు చెబుతున్నారు. శానిటేషన్‌కు సంబంధించి టెండర్లు నిర్వహించకుండానే అధికారులు పనులు కట్టబెట్టడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.

విజయవాడ సిటీ1
1/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/10

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement