సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌తో అనర్థాలపై అవగాహన కల్పించ
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యార్థులకు చిన్న తనం నుంచే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని వీఎంసీ డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డాక్టర్ సృజన అన్నారు. దీని కోసం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామని వివరించారు. శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అవగాహన పెంచుకుంటే అందరికీ తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
వీఎంసీ డిప్యూటీ కమిషనర్ సృజన


