వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి సోమవారం జరిగిన మ్యాథ్స్ పేపరుకు 343 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 168 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సోమవారం 28,122 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 27,779 మంది హాజరయ్యారు. హాజరు 98.78 శాతంగా అధికారులు ప్రకటించారు. పాఠశాల విద్యా జోన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి. నాగమణి జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గవర్నరుపేట, సత్యనారాయణపురం, జక్కంపూడి, గాంధీనగర్, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని సుమారు ఎనిమిది పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 114 కేంద్రాలను తనిఖీ చేశాయి.