జి.కొండూరు(ఇబ్రహీంపట్నం): ఓ వైపు భార్యతో కలహాలు, మరోవైపు అనారోగ్య ఇబ్బందులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మునగపాడులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మునగపాడుకు చెందిన షేక్ ఫకీర్‌బాషా(26) గడ్డమణుగుకు చెందిన కలపాల మనూషాతో కొన్నేళ్ల కిందట క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప ఉన్నారు. మద్యానికి బానిసైన ఫకీర్‌బాషా తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో భార్య పదిరోజుల కిందట పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. ఈనేపథ్యంలో కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఫకీర్‌బాషా తనను చూసుకునేందుకు ఎవరూ లేరని మనస్తాపం చెంది తనగదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. పక్కనే నివాసం ఉంటున్న మృతుని తల్లిదండ్రులు, ఫకీర్‌బాషా ఆత్మహత్నాయత్నం చేసిన విషయాన్ని గమనించి అతన్ని మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంనకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.