
రెస్టారెంట్‌లో వంటశాలను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ కానూరు, గొల్లపూడిలోని ఖలీల్‌భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార భద్రత ప్రమాణాలను పరిశీలించారు. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని గుర్తించారు. ఆహార పదార్థాలపై మూతలు లేకపోవడం, వంట శాల పరిశుభ్రంగా లేకపోడంతో హోటల్ యజమానికి నోటీసులు జారీ చేశామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి టి.కనకరాజు తెలిపారు. సేకరించిన ఆహార పదార్థాల శ్యాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపామని చెప్పారు.