క్రషర్లను మూసి వేయాలి
‘యోగాంధ్ర’కు పటిష్ట బందోబస్తు
కంచికచర్ల: రాతి క్వారీలు, క్రషర్లు వెదజల్లే దుమ్ము ధూళి వల్ల రెండు పంటలు పండే పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పంటలు సాగుచేసే సమయంలో సాగర్ కాలువను పూడ్చటంతో సాగునీరు సరఫరా కాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేద్దామనుకుంటే క్రషర్ యజమానులు భూములను అమ్ముకోవద్దని తమను బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ సమీపంలో 801 సర్వే నంబర్లలో 74 రాతి క్వారీలు, 25 వరకు క్రషర్లు ఉన్నాయి. క్వారీలు, క్రషర్ల సమీపంలో 450 ఎకరాల పంట భూములున్నాయి. ఆ భూముల్లో రైతులు పంటలు సాగు చేద్దామన్నా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో లారీలకు భారీగా లోడింగ్ చేసి కంకర, మట్టి తరలిస్తున్నారు. దీంతో కాలుష్యం నిరంతరం వెదజల్లుతోంది.
సాగర్ జలాలు రాకుండా కాల్వ పూడ్చివేత..
పంట పొలాలకు నాగార్జున సాగర్ జలాలు వచ్చేవి. ఆ నీటితో మూడు దశాబ్దాల క్రితం వరకు ఆ భూముల్లో రైతులు రెండు పంటలు పండించేవారు. కానీ క్వారీ గుత్తేదారులు, క్రషర్ల యజమానులు వారి వ్యాపారం కోసం సాగర్ కాలువలను సైతం పూడ్చివేసి రోడ్లు వేసుకున్నారు. దీంతో పంటలు సాగుచేసేందుకు సాగునీరు రాకపోవటంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
క్రషర్ల యజమానుల బెదిరింపులు..
పంట పొలాలను తక్కువ ధరకు ఇవ్వాలని లేకపోతే ఇతరులకు ఎవరికి విక్రయించినా ఊరుకునేది లేదని క్వారీ గుత్తేదారులు బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్న తమ పొలాలు బయట మార్కెట్‌లో ఎకరం భూమి రూ. కోటి 20 లక్షలు వరకు కొనుగోలు జరుగుతున్నాయని క్వారీ నిర్వాహకులు మాత్రం తమ భూములను కేవలం రూ.40 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
పచ్చని పొలాలకు
కాల్వను పూడ్చివేశారు..
సాగర్ జలాలు మూలపాడు మేజర్ కెనాల్ ద్వారా వచ్చేవి. ఆ సాగు నీటితో రెండు పంటలు పండించే వాళ్లం. క్వారీ నిర్వాహకులు సాగర్ కాల్వలను పూడ్చివేసి ఆ మట్టిని కూడా క్వారీ యజమానులు విక్రయించారు. తమ భూములను ప్రభుత్వమే కాపాడాలి.
– పురమా వెంకట శివప్రసాద్, రైతు, పరిటాల
బ్లాస్టింగ్‌తో బండరాళ్లు వచ్చి పడుతున్నాయి..
రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుళ్ల పదార్థాలను బ్లాస్టింగ్ సమయంలో ఉపయోగించటం ద్వారా అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వస్తున్నాయి. అనుభవం లేని కార్మికులచే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుళ్ల పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. ఆ పేలుళ్లకు ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. పేలుళ్ల సమయంలో రాళ్లు లేచి జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సైతం తీవ్రగాయాలైన సంఘటనలు సాధారణమైంది.
దుమ్ము ధూళితో బీడు భూములుగా మారుతున్న వైనం
సాగర్ కాల్వను పూడ్చటంతో
సరఫరా కాని సాగు జలాలు
భూములను అమ్ముకుందామన్నా
బెదిరిస్తున్న క్రషర్ల యజమానులు
ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు
నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. కానీ ఆ పొలం సాగు చేద్దామంటే క్రషర్ల నుంచి దుమ్ము, ధూళి వెదజల్లుతోంది. దీంతో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి, క్రషర్లను మూసివేసి పంటలు సాగయ్యేలా చూడాలి.
– బండ్ల నాగేశ్వరరావు, రైతు, పరిటాల
మనీ.. మోర్ మనీ!
మనీ.. మోర్ మనీ!
మనీ.. మోర్ మనీ!
మనీ.. మోర్ మనీ!
మనీ.. మోర్ మనీ!