సింగపూర్‌ వెండితెరపై తొలి తెలుగు లఘు చిత్రం ‘సిరిజోత’ విడుదల

telugu short film Sirijotha launched in singapore - Sakshi

సింగపూరు: శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన లఘు చిత్రం సిరిజోత  గురువారం(జనవరి 12) రాత్రి  సింగపూరు ఈగల్ వింగ్స్ సినిమేటిక్స్ లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి  కథ మాటలు సుబ్బు పాలకుర్తి, కవిత కుందుర్తి అందించారు. సురేష్ రాజ్ దర్శకత్వంలో అభిరాం, విజయ భరత్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం  యూ ట్యూబ్ మాధ్యమం ద్వారా లాంచ్‌ అయింది.

తెలుగు భాషా ప్రాముఖ్యతను వివరిస్తూ ఆద్యంతం తెలుగు కోసం పాటుపడే పాత్రల సంఘర్షణలతో రూపొందించిన ఈ చిత్రాన్ని సింగపూరు నందు నివశిస్తున్న తెలుగు ప్రముఖులు అభినందలందించారు.  

తెలుగు భాషాభిమానులందరూ తప్పక చూడవలసిన చిత్రం అని కొనియాడారు. శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు శ్రీ రత్నకుమార్ కవుటూరు, కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు శ్రీ రాంబాబు పాతూరి, సింగపూరు తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు శ్రీ రంగ రవి, సింగపూరు పోతన భాగవత ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ భాస్కర్ ఊలపల్లి, తాస్ అధ్యక్షులు శ్రీమతి అనితా రెడ్డి, అమ్ములు గ్రూపు సభ్యులు శ్రీమతి సునీత  తదితర ప్రముఖులందరూ  వచ్చి తమ చిత్రాన్ని చూసి అభినందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అలాగే  సింగపూరు వెండి తెర మీద ప్రదర్శించిన తొలి తెలుగు లఘు చిత్రం తమది కావడం.. అందులోనూ తెలుగు భాష మీద నిర్మించిన చిత్రం కావడం మరింత ఆనందదాయకమని నిర్మాత సుబ్బు పాలకుర్తి  సంతోషం వ్యక్తం చేశారు.

 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top