విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వ్యక్తి.. స్పందించిన మంత్రి కేటీఆర్

కుటుంబ పోషణ కోసం, మంచి భవిష్యత్తు కోసం భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస పోతుంటారు. అలా వెళ్లిన చాలా మంది తెలుగోళ్ల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయ్. అలాంటి ఓ బాధితుడి ఆవేదన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అన్నా, నన్ను తీసుకుపో, మా అమ్మకు నేను ఒక్కడ్నే కొడుకును అంటూ ’ ఆ గల్ఫ్ బాధితుడి వీడియో చూసి మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణలోని సిరిసిల్ల వాసి తన చెల్లెలి చదువు, పెళ్లి కోసం ఇటీవల దుబాయ్ వెళ్ళాడు. ఎన్నో ఆశలతో ఆ దేశంలో అడుగుపెట్టిన అతను ఏజెంట్ మోసం చేశాడు. ప్రస్తుతం అతడు నరకం అనుభవిస్తున్నాడు. దయచేసి ఈ వ్యక్తికి సహాయం చేయండి. అతడిని మన దేశానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నట్లు ఓ ట్విటర్ యూజర్ మంత్రి కేటీఆర్‌కి ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన ఆయన.. ఆ బాధితుడిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సహాయం చేస్తామని హామి ఇచ్చారు. ఆ ట్వీట్‌లోనే.. ‘మేము @cgidubai, @IndembAbuDhabi కలిసి పని చేసి అతడిని భారతదేశానికి తిరిగి తీసుకువస్తామన్నారు’. దీంతో పాటు @KTR ఆఫీసుకు ఈ వ్యవహారాన్ని ట్యాగ్ చేసి ఈ విషయమై NRI వ్యవహారాల విభాగంతో సమన్వయం చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు.
We will work with @cgidubai and @IndembAbuDhabi to bring you back to India @KTRoffice please coordinate with NRI affairs department https://t.co/gZWQHZ0p9D
— KTR (@KTRTRS) January 3, 2023