అద్భుతం ఆవిష్కరించిన ఎన్నారై సైంటిస్ట్‌.. ప్రపంచంలోనే తొలిసారిగా.. | NRI scientist Who is From Warangal creates a model for brain injury treatments | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ ఇంజ్యూరీలో కొత్త చికిత్స విధానం కన్నిపెట్టిన ఎన్నారై.. వెన్ను తట్టిన యూఎస్‌ మిలిటరీ

Mar 22 2022 10:48 AM | Updated on Mar 22 2022 9:24 PM

NRI scientist Who is From Warangal creates a model for brain injury treatments - Sakshi

హెల్మెట్‌ లేకుండా బయటకి వెళితే చాలు ట్రాఫిక్‌ వాళ్లు వెంటనే జరిమాన విధిస్తున్నారు. ఎందుకుంటే హెల్మెట్‌లేని ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే తలకు దెబ్బతగలడం.. పర్యవసానంగా మరణం సంభవించడమో లేదా దీర్ఘకాలం పాటు అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు దారి తీయడంమో జరుగుతోంది. అయితే ‍అవాంఛనీయ సంఘటనల్లో తలకు గట్టిగా దెబ్బ తగిలితే తిరిగి కోలుకునే మోడల్‌ని ఓ ఇండో అమెరికన్‌ సైంటింస్ట్‌ దూదిపాల సాంబారెడ్డి రూపొందించారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన సాంబారెడ్డి స్థానికంగా ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసన్‌, టెక్సాస్‌లో పని చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా మెదడు సంబంధిత ఔషధాలను అభివృద్ధి చేయడంపై ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యూరీ (టీబీఐ) ఎపిలెప్సీలో చికిత్సకి సంబంధించి న్యూ జెనరేషన్‌ మోడల్‌ని అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఎక్సిపెరిమెంటల్‌ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 6.90 కోట్ల మంది తలకు బలమైన గాయాలు అవుతున్నాయి. వీరిలో కొందరు అక్కడిక్కడే చనిపోతుండగా మిగిలిన వారు పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిసార్డర్‌ (పీఎస్‌టీడీ), డిప్రెషన్‌, పూర్‌ మోటార్‌ బ్యాలెన్స్‌ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీలో పని చేసే సైనికులు, అ‍థ్లెట్లు కూడా  ట్రామాటిక​ బ్రెయిన్‌ ఇంజూరీ కారణంగా ఇబ్బంది పడుతున్న వారి జాబితాలో అధికంగా ఉన్నారు. వీటిని పోస్ట్‌ ట్రామాటిక్‌ ఎపిలెప్సీగా పేర్కొంటారు. ఇలా బాధపడే వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇప్పటి వరకు ప్రభావవంతమైన చికిత్సా విధానం లేదు. కాగా ప్రస్తుతం సాంబారెడ్డి పరిశోధనల ఫలితంగా వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. 

వైద్య రంగంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు సాంబరెడ్డి పరిశోధనలు పరిష్కారం చూపుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు ఫండింగ్‌ చేసేందుకు అమెరికా డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చింది. అంతేకాదు సైన్యంలో గాయపడిన వారికి డాక్టర్‌ సాంబారెడ్డి సూచించిన విధంగా చికిత్స అందిస్తూ ఫలితాలు అంచనా వేయడానికి అవకాశం కల్పించింది. 

బ్రెయిన్‌కి సంబంధించిన స్పస్టమైన సమచారం లేకుండా మనం బ్రెయిన్‌ ఇంజ్యూరీకి చికిత్స చేయడం అసాధ్యం. అయితే ఇప్పుడు మేము అభివృద్ధి చేసిన మోడల్‌ ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యూరీకి సంబంధించి మొదటి మోడల్‌. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో మరింత అడ్వాన్స్‌డ్‌ మెథడ్స్‌ అందుబాటులోకి వస్తాయంటున్నారు డాక్టర్‌ సాంబారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement