breaking news
brain injuries
-
Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? దేనివల్ల అనే విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. నిజానికి ఇక్కడ సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడూ ఆయనకు ఇలా జరగడం అందర్నీ తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంటే ఇక్కడ సద్గురు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. నిజానికి ఇలా మెదడులో రక్తస్రావం అవ్వడానికి ముందు సంకేతమే తీవ్రమైన తలనొప్పి అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టైంలోనే వైద్యులను సంప్రదిస్తే మెదడులో బ్లీడింగ్ జరగకుండా కొంత నిరోధించగలమని చెబుతున్నారు. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుందంటే..? బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే ఇది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.. ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇక్కడ సద్గురు నాలుగువారాలుగుఆ తీవ్రమైన తలనొప్పిని ఫేస్ చేశారు. అయినప్పటికీ సామాజికి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో సమస్య తీవ్రమయ్యిందని చెప్పొచ్చు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఎందుకు వస్తుందంటే.. అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. అయితే జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి కూడా స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలను ఒక నెల ముందు నుంచి కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా పసిగడితే ప్రాణాపాయం నుంచి బయటపడగలమని అంటున్నారు నిపుణులు. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
అద్భుతం ఆవిష్కరించిన ఎన్నారై సైంటిస్ట్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హెల్మెట్ లేకుండా బయటకి వెళితే చాలు ట్రాఫిక్ వాళ్లు వెంటనే జరిమాన విధిస్తున్నారు. ఎందుకుంటే హెల్మెట్‌లేని ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే తలకు దెబ్బతగలడం.. పర్యవసానంగా మరణం సంభవించడమో లేదా దీర్ఘకాలం పాటు అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు దారి తీయడంమో జరుగుతోంది. అయితే అవాంఛనీయ సంఘటనల్లో తలకు గట్టిగా దెబ్బ తగిలితే తిరిగి కోలుకునే మోడల్ని ఓ ఇండో అమెరికన్ సైంటింస్ట్ దూదిపాల సాంబారెడ్డి రూపొందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సాంబారెడ్డి స్థానికంగా ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన ఎ అండ్ ఎం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసన్, టెక్సాస్‌లో పని చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా మెదడు సంబంధిత ఔషధాలను అభివృద్ధి చేయడంపై ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ (టీబీఐ) ఎపిలెప్సీలో చికిత్సకి సంబంధించి న్యూ జెనరేషన్ మోడల్ని అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఎక్సిపెరిమెంటల్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 6.90 కోట్ల మంది తలకు బలమైన గాయాలు అవుతున్నాయి. వీరిలో కొందరు అక్కడిక్కడే చనిపోతుండగా మిగిలిన వారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీఎస్టీడీ), డిప్రెషన్, పూర్ మోటార్ బ్యాలెన్స్ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీలో పని చేసే సైనికులు, అథ్లెట్లు కూడా ట్రామాటిక బ్రెయిన్ ఇంజూరీ కారణంగా ఇబ్బంది పడుతున్న వారి జాబితాలో అధికంగా ఉన్నారు. వీటిని పోస్ట్ ట్రామాటిక్ ఎపిలెప్సీగా పేర్కొంటారు. ఇలా బాధపడే వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇప్పటి వరకు ప్రభావవంతమైన చికిత్సా విధానం లేదు. కాగా ప్రస్తుతం సాంబారెడ్డి పరిశోధనల ఫలితంగా వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. వైద్య రంగంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు సాంబరెడ్డి పరిశోధనలు పరిష్కారం చూపుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు ఫండింగ్ చేసేందుకు అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చింది. అంతేకాదు సైన్యంలో గాయపడిన వారికి డాక్టర్ సాంబారెడ్డి సూచించిన విధంగా చికిత్స అందిస్తూ ఫలితాలు అంచనా వేయడానికి అవకాశం కల్పించింది. బ్రెయిన్‌కి సంబంధించిన స్పస్టమైన సమచారం లేకుండా మనం బ్రెయిన్ ఇంజ్యూరీకి చికిత్స చేయడం అసాధ్యం. అయితే ఇప్పుడు మేము అభివృద్ధి చేసిన మోడల్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి సంబంధించి మొదటి మోడల్. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో మరింత అడ్వాన్స్డ్ మెథడ్స్ అందుబాటులోకి వస్తాయంటున్నారు డాక్టర్ సాంబారెడ్డి -
మహిళా జర్నలిస్టుపై దాడి..పరిస్థితి విషమం
న్యూడిల్లీ: ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై దాడి చేసింది. ఈవినింగ్ వాక్ కోసం వెళ్లిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు అపర్ణ కల్రా(45) గుర్తు తెలియని వ్యక్తి దాడిచేశాడు. దీంతో ఆమెతీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ అశోక్ విహార్ లో పబ్లిక్ పార్క్‌లో బుధవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి అపర్ణపై దాడి చేశాడు. ఇనుపరాడ్ తో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలో అపర్ణ అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెదడుకు మల్టిపుల్ గాయాలు కావడంతో ఫోర్టిస్ ఆస్పత్రిలో వైద్యులు ఒక శస్త్రచికిత్స నిర్వహించారనీ, కానీ పరిస్థితి విషమంగా ఉందనీ అపర్ణ బంధువు భాటియా తెలిపారు. సెల్ ఫోన్ చోరీ కోసం దాడి జరిగి ఉంటుందని మొదట అనుమానించామనీ, కానీ ఆమె ఫోన్ ఇంట్లోనే వదిలి వాకింగ్ వెళ్లారని చెప్పారు.ఆమె దగ్గర ఇతర విలువైన వస్తువులు ఏమీ లేవని చెప్పారు. హత్యా యత్నం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు డిసిపి (నార్త్-వెస్ట్)మిలింద్ డుంబ్రే చెప్పారు. ముక్కు, తలనుంచి తీవ్ర రక్త స్రావంతో పడివున్న ఆమెపై తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. దాడిచేసిన వారి గురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కాగా ఫ్రీ జర్నలిస్టుకాక ముందు అపర్ణ చాలా జాతీయ దినపత్రికల్లో పనిచేశారు.