అక్కడ మౌనంగా ఉండండి.. కెమెరాలతో హడావుడి చేస్తే తాట తీస్తారు

Kuwait municipality Ban Photo Video Shoot At Funerals - Sakshi

స్మశాన వాటికల దగ్గర ఎవరైనా కెమెరాలతో హడావుడి చేస్తే చెల్లదంటూ తేల్చి కువైట్‌ ప్రభుత్వం చెప్పింది. అంత్యక్రియల దగ్గర పాటించాల్సిన నిబందనలను తాజాగా సవరించింది. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యూనరల్‌ డిపార్ట్‌మెంట్‌ కువైట్‌ తెలిపిన వివరాల ప్రకారం స్మశానాల్లో ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీయడం, దిగడం చేస్తే 5,000 కువైటీ దినార్లు జరిమానాగా విధిస్తామని పేర్కొంది.

రాజకీయ నాయకులు, స్పోర్ట్స్‌ పర్సనాలిటీస్‌, ఇతర సెలబ్రిటీలు చనిపోయినప్పుడు స్మశానాల దగ్గర కెమెరాల హడావుడి ఎక్కువైంది. అంత్యక్రియల దగ్గర కెమెరాల కారణంగా వాతావరణం పాడైపోతుంది. దీంతో కువైట్‌ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంత్యక్రియల కోసం ఉపయోగించిన స్మశానంలో ఇతర కార్యక్రమాలు చేపట్టినట్టు తేలితే కనిష్టంగా రెండు వేల దినార్లు గరిష్టంగా 5 వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top